దీపికారెడ్డి బాధ్యతల స్వీకరణ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: సంప్రదాయ సంగీత, నృత్య, నాటకోత్సవాలు జంటనగరాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ అధ్యక్షురాలు దీపికారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అకాడమీ కార్యాలయంలో గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామని, తద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జులూరు గౌరీశంకర్‌, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సంగీత, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్‌ బి.శివకుమార్‌ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని