యాదాద్రిలో దేవాలయ నిర్మాణశాస్త్రం బోధన

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో ఏర్పాటైన శిల్ప కళాశాలలో దేవాలయ నిర్మాణ శాస్త్రం మూడేళ్ల కోర్సు బోధించనున్నట్లు యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(యాడా) వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు. మూడేళ్ల కోర్సులో భాగంగా ఆర్కిటెక్ట్‌, ట్రెడిషనల్‌, శిల్పకళా నైపుణ్యం నేర్పించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్టిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ నుంచి అనుమతి లభించిందన్నారు. కొండ కింద యాడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కళాశాలలో సంప్రదాయ శిల్పకళా బోధనతో పాటు శిక్షణ ఇస్తామని, ఇంటర్‌ ఉత్తీర్ణులయిన వారు ఈ కోర్సులో చేరవచ్చని కిషన్‌రావు పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని