విద్యాసంస్థల్లో 8 నుంచి ‘స్వాతంత్య్ర’ కార్యక్రమాలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఆజాదికా అమృతోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 8 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యాసంస్థల్లో 15 రోజులపాటు పండగ వాతావరణం నెలకొనేలా చూడాలని మంత్రి అధికారులను కోరారు. స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలు, చేసిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలను నేటి తరానికి తెలిసేలా వక్తృత్వ, వ్యాసరచన పోటీలను, జాతీయ భావాలను రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.  విద్యార్థులందరూ గాంధీ సినిమాను చూసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఆ సందర్భంగా వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల 10న వజ్రోత్సవ వన మహోత్సవాన్ని నిర్వహించి ప్రతి విద్యాసంస్థలో కనీసం 75 మొక్కలు నాటాలని కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని