వజ్రోత్సవాల వేళ.. ఫ్రీడం ప్లాంటేషన్‌

10న ప్రత్యేక కార్యక్రమం: పీసీసీఎఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ నేపథ్యంలో ఫ్రీడం ప్లాంటేషన్‌ పేరుతో పెద్దఎత్తున మొక్కలు నాటనున్నారు. కొత్తగా గుర్తించిన ప్రదేశాల్లో మొక్కలు నాటి ఫ్రీడం పార్కులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎనిమిదో విడత హరితహారం పురోగతిపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయితీ రాజ్‌, ఇరిగేషన్‌, అటవీ శాఖ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియల్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా 10వ తేదీన రాష్ట్రంలో అన్ని చోట్లా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కోరారు. కొన్ని జిల్లాల్లో మొక్కల పంపిణీని పెద్ద సంఖ్యలో చూపుతున్నారంటూ లెక్కలపై పీసీసీఎఫ్‌ ఆరా తీశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని