గురుకులాల పార్ట్‌టైం సిబ్బంది వేతనాల పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైం బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనం జులై 2022 నుంచి వర్తిస్తుందని సాంఘికసంక్షేమ శాఖ కార్యదర్శి డి.రొనాల్డ్‌రోస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్లకు రూ.30,000 నుంచి రూ.32,500కు, జూనియర్‌ లెక్చరర్లకు రూ.18,000 నుంచి రూ.23,400కు, పీజీటీ/టీజీటీలకు రూ.14,000 నుంచి రూ.18,200కు, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌లు, పీఈటీలు, స్టాఫ్‌ నర్సులకు రూ.10,900 నుంచి రూ.14,170కి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించాలి

సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలకు 65 మంది వీఆర్వోలను కేటాయించిన నేపథ్యంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆసోషియేషన్‌ అధ్యక్షులు సి.హెచ్‌.బాలరాజు ఒక ప్రకటనలో కోరారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని