జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఆరుగురి పేర్లు సిఫారసు

ఈనాడు, హైదరాబాద్‌: ఈ సంవత్సరానికి జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలగానూ విద్యాశాఖ రాష్ట్రం నుంచి ఆరుగురి పేర్లను సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా 130 మంది పేర్ల జాబితా జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ)కి అందింది. రాష్ట్రం నుంచి సిఫారసు చేసిన వారిలో మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటలో పనిచేస్తున్న టీఎన్‌ శ్రీధర్‌, కందాల రామయ్య(ములుగు జిల్లా), కొమ్ము లక్ష్మీనారాయణ(ఆసిఫాబాద్‌ జిల్లా), బి.సంతోష్‌కుమార్‌(మంచిర్యాల జిల్లా), ఆముదాల నర్సింహస్వామి(గద్వాల జిల్లా), నోగూరి అర్చన(మంచిర్యాల జిల్లా) ఉన్నారు. వారికి ఈ నెల 10న ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహిస్తారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని