
‘సైబర్’ ప్రత్యేక వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ఠ!
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యతో అధికారుల్లో ఆశాభావం
ఈనాడు - హైదరాబాద్
సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందే అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రతిపాదిత ప్రత్యేక విభాగం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేందుకు ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు జరిగాయి. కాని నిధులు, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల దీనికో రూపం రాలేదు. ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సైబర్‌నేరాల గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కట్టడి విషయమై మాట్లాడారు. దీంతో చాలాకాలంగా అధికారుల ఆలోచనకే పరిమితమైన ప్రత్యేక విభాగం ఏర్పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధాని పరిధిలో రోజుకు వంద వరకూ ఫిర్యాదులు...
గత ఏడాది రాష్ట్రంలో 8వేలకుపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఈ ఏడాది వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కేవలం రాజధాని పరిధిలోని మూడు కమిషనరేట్లలోనే రోజుకు వంద వరకూ ఫిర్యాదులు వస్తున్నాయి. మిగతా అన్నింటి కంటే సైబర్ నేరాలే ఏటికేడు రెట్టింపవుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత సంప్రదాయ నేరాలు అదుపు చేసేందుకు అధికారులు తీసుకున్న చర్యలు బాగానే ఫలించాయి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నేరస్థులను పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటం, తరచూ నేరాలకు పాల్పడేవారిని గుర్తించి పీడీ చట్టం ప్రయోగించడం వంటి చర్యల వల్ల అసాంఘిక శక్తుల్లో భయం కలిగింది. ఉత్తరాది నుంచి విమానాల్లో వచ్చిమరీ ఇక్కడ గొలుసు దొంగతనాలకు పాల్పడే ముఠాలు ఇటు తిరిగి చూడటమే మానేశాయి. ఇప్పుడు ఇంచుమించు వాటి ఊసే లేదు. నేరం చేస్తే పట్టుబడతారన్న భయం కల్పించడంలో తెలంగాణ పోలీసులు సఫలమయ్యారు. భవిష్యత్తులో సంప్రదాయ నేరాలు తగ్గిపోయి సైబర్ నేరాలు పెరిగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సైబర్ స్టేషన్లు ఉన్నా...
సైబర్ నేరాల్లో.. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియని నిందితుణ్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఇప్పుడు సైబర్ పోలీస్స్టేషన్లు ఉన్నా అవన్నీ వేటికవే ఆయా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనేది అధికారులు ఆలోచన. ఇందులో పనిచేసేవారికి సాంకేతిక అంశాల్లోనూ పరిజ్ఞానం ఉండాలి. గత కొంతకాలంగా జరుగుతున్న పోలీసు నియామకాలను గమనిస్తే ఇంచుమించు నాలుగో వంతుమంది ఇంజినీరింగ్, ఇతర ఉన్నతవిద్యావంతులే ఉంటున్నారు. ఇటువంటి వారికి శిక్షణ ఇచ్చి సైబర్ విభాగంలో నియమించాలని, ఐజీ లేదా అదనపు డీజీ స్థాయి అధికారికి దీని బాధ్యత అప్పగించాలనేది అధికారుల ఆలోచన. ఇప్పుడు ముఖ్యమంత్రి నోటి నుంచే సైబర్ నేరాలకు ప్రత్యేక విభాగం ప్రస్తావన రావడంతో త్వరలోనే ఇది సాకారమవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం పోలీసు కమాండ్ సెంటర్
ట్విటర్లో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు గురువారం ట్విటర్లో తెలిపారు. అద్భుత నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ గురువారం రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారని వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో చిత్రీకరించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌సెంటర్ వీడియో దృశ్యాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్‌లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్