కామన్వెల్త్‌ క్రీడా గ్రామంలో వసతుల పరిశీలన

కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బృందం అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: కామన్వెల్త్‌ క్రీడోత్సవాలపై అధ్యయనానికి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో పర్యటిస్తున్న తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం అక్కడి క్రీడాగ్రామాన్ని సందర్శించారు. వసతులను, నిర్మాణాలను పరిశీలించారు. బ్రిటన్‌ క్రీడామంత్రి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులను కలిసి కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ ప్రణాళిక గురించి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ విదేశీ క్రీడాకారులను కలిసి వారి వారి దేశాల్లోని క్రీడారంగం అభివృద్ధి గురించి మాట్లాడారు.

నిఖత్‌ జరీన్‌కు అభినందనలు

కామన్వెల్త్‌ క్రీడోత్సవాలలో తలపడుతున్న తెలంగాణ బాక్సింగ్‌ క్రీడాకారిణి నిఖత్‌ జరీన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (సాట్స్‌) ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్‌రావులు కలిసి అభినందనలు తెలిపారు. ఆమె బంగారు పతకం సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని