అక్టోబర్‌లో హిందూపురం నుంచి ఇచ్చాపురానికి పాదయాత్ర

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌

గుంటూరు, న్యూస్‌టుడే: ఏపీకి ప్రత్యేక హోదా, విభజనల హామీల అమలు కోసం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆగస్టులో తలపెట్టిన పాదయాత్ర అనివార్య కారణాలతో అక్టోబర్‌కు వాయిదా వేసుకున్నట్లు రాష్ట్ర విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. ఈలోగా అన్ని ప్రాంతాల్లో సన్నాహక సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పాదయాత్రకు సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను ఆహ్వానిస్తామన్నారు. గురువారం గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 97 శాతం ప్రజలు మోదీని వ్యతిరేకిస్తుంటే, 97 శాతం ఓట్లు తెచ్చుకున్న వైకాపా, తెదేపా, జనసేన పార్టీలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించకపోవడాన్ని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల వద్ద తాకట్టు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవేకి శంకుస్థాపన చేసిన మోదీ 2022 నాటికి రూ.15 వేల కోట్లతో పూర్తి చేశారన్నారు. అదే ఏపీలో ఎనిమిదేళ్లుగా అనంతపురం-గుంటూరు అనుసంధాన హైవే నిర్మాణానికి ఒక్క రూపాయీ కేటాయించకపోయినా ఇక్కడి నాయకుడు అడగలేకపోతున్నారని మండిపడ్డారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని