ఆలోచన భళా.. నారు పంపకం ఇలా!

సాగుకు ముందు పొలం దున్నాలి.. దమ్ము చేయాలి.. ఆపై నాట్లు వేయాలి.. ప్రతి పనికీ కూలీల కొరతను అధిగమించాలి.. అందుకే సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు.. కొత్త ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం ఐతెరాజుపల్లిలోని పొలంలో ఒకపక్క ట్రాక్టరుతో దమ్ము చేస్తూనే దానికి కట్టిన బండి సాయంతో నారుకట్టలను అవసరమైన చోటకు విసురుతున్నారు. ఇలా చేయటం వల్ల దమ్ము ముగిశాక నాట్లు వేయడం సులువవుతుందని రైతులు చెబుతున్నారు.

- ఈనాడు, కరీంనగర్‌


మరిన్ని

ap-districts
ts-districts