ముగిసిన మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిశాయి. వారోత్సవాలు జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలను పార్టీ గురువారం విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో బుధవారం వారోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించారు. 50 అడుగుల స్మారక స్తూపాన్ని నిర్మించారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. చారు మజుందార్‌, ఆర్కే, రామన్న, హరిభూషణ్‌, భారతక్క తదితర దివంగత అగ్రనేతలను స్మరించుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌ల నుంచి పెద్దఎత్తున మావోయిస్టులు హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా మావోయిస్టులు, ఆదివాసీలు భారీ ప్రదర్శన నిర్వహించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని