53 డీఏఓ పోస్టుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు(డీఏఓ) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబరు ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

ఏఎంవీఐ దరఖాస్తుల స్వీకరణ వాయిదా

రాష్ట్రంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్ల(ఏఎంవీఐ) పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్లు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. స్వీకరణ కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలియజేసింది.

నిబంధన సడలించాలి

గత నెల 27న ఏఎంవీఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ జారీ చేసేనాటికి అభ్యర్థులు హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలనే నిబంధన సడలించి హెవీ వెహికల్‌ లైసెన్సు గడువు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కోరారు. వారంతా ఖమ్మం వచ్చి క్యాంప్‌ కార్యాలయంలో మంత్రిని కలసి వినతి పత్రం అందించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని