యాదాద్రిలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రీశుల దివ్యాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. అష్టభుజి ప్రాకార మండపంలో ఏర్పాటైన యాగశాలలో సోమవారం ప్రత్యేక జప హోమం నిర్వహించారు. ఆలయ నిత్య కైంకర్యాల నిర్వహణలో చోటు చేసుకున్న పొరపాట్ల నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం వైష్ణవ సంప్రదాయమని ఆలయ ప్రధాన పూజారి నరసింహాచార్య తెలిపారు. చతుస్థానార్చన, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. ప్రత్యేక ఆరాధనలతో ఈ క్షేత్ర మూలవరులను కొలిచారు. మంత్ర పఠనాలు, హోమం మధ్య రూపొందించిన పవిత్ర మాలలను మహావిష్ణువు ప్రధాన ఆయుధమైన శ్రీసుదర్శన ఆళ్వారుడికి ధరింపజేశారు. ఈ వేడుకలతోపాటు ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పాలతో ఆరాధన, శ్రావణ లక్ష్మీదేవి కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఈ పర్వాలలో ఆలయ ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం పవిత్రమాలలను ఆలయ  విమానానికి అలంకరించారు. శ్రీసుదర్శన చక్రమాలలు ధరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని