కాళోజీ వర్సిటీ ఎదుట వైద్య విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని టీఆర్‌ఆర్‌, ఎంఎన్‌ఆర్‌, మహావీర్‌ వైద్య కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం వరంగల్‌ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట మరోసారి ఆందోళనకు దిగారు. వీటిలో ఎంబీబీఎస్‌, పీజీ వైద్య సీట్లను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రద్దు చేయడంతో వారు మూడు నెలలుగా న్యాయం కోసం తిరుగుతున్నారు. రద్దుచేసిన సీట్లను అనుమతి పొందిన ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో సర్దుబాటు చేయాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశ్వవిద్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు రక్షణ సిబ్బందితో అడ్డుకొని గేట్లు మూసి వేశారు. వాటి ఎదుటే సుమారు 4 గంటల పాటు ధర్నా చేశారు. వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ జాతీయవైద్య మండలి ఆదేశాల మేరకు రద్దుచేసిన కాలేజీల్లోని విద్యార్థులను వెంటనే వేరే కళాశాలల్లో సర్దుబాటు చేయాలని, విద్యార్థుల సమస్యను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పట్టించుకోవడం లేదన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని