ఎర్రచందనం కలప తరలింపునకు చర్యలు

‘ఈనాడు’ కథనానికి స్పందించిన ఎంపీ సంతోష్‌కుమార్‌

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రభుత్వానికి హరితనిధి కింద వితరణగా అందజేసిన ఎర్రచందనం కలపను తరలించేందుకు అటవీశాఖ అధికారులు సోమవారం కసరత్తు ప్రారంభించారు. ‘వనజీవి దాతృత్వం.. అందిపుచ్చుకోని అటవీ శాఖ’ అనే శీర్షికన ‘ఈనాడు’లో ఈ నెల 8న ప్రచురించిన కథనానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి ఎర్రచందనం కలపను వెంటనే తరలించాలని సూచించారు. ఎంపీ చొరవతో సత్తుపల్లి ఎఫ్‌డీవో సతీశ్‌, అధికారులు వచ్చి వనజీవి రామయ్య ఇంటి వద్ద ఉన్న కలపను, కలపకు వేసిన నంబర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీవో మాట్లాడారు. కలప విలువను అంచనా వేసి స్థానికంగా విక్రయించాలా? హైదరాబాద్‌కు తరలించాలా? అనే అంశం పరిశీలిస్తున్నామన్నారు.  వనజీవి రామయ్యతో అటవీ శాఖ అధికారులు మాట్లాడారు. త్వరలోనే కలపను తరలిస్తామని హామీ ఇచ్చారు. .


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని