Dindi: డిండి.. పూర్తిగా నిండి

ఎగువనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లాలోని డిండి జలాశయం గరిష్ఠ నీటిమట్టం 36 అడుగుల (గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.45 టీఎంసీల)కు చేరింది. సోమవారం 1,400 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా.. డిండి స్పిల్‌ వే, ఎడమ కాల్వ ద్వారా కలిపి 1,400 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉన్నట్లు నీటి పారుదలశాఖ ఏఈ ఫయాజ్‌ తెలిపారు. జలాశయం పూర్తిగా నిండడంతో స్పిల్‌ వే గుండా అలుగు పారుతున్న దృశ్యం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటోంది. 

- డిండి, న్యూస్‌టుడే


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని