Andhra news: కుర్చీ ఆమెది.. పెత్తనం ‘ఆయన’ది

గడియార స్తంభం, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ డి.అచ్యుత జానకి అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీపీ భర్త రాంబాబు సభా వేదికపై అధికారులతోపాటు కూర్చున్నారు. ఆయనే స్వయంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బందితో సమీక్షించారు. ఎలాంటి అధికారిక హోదా లేని రాంబాబు సమావేశంలో ఎలా పాల్గొన్నారు? అధికారులెలా అనుమతించారు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు.


మరిన్ని

ap-districts
ts-districts