క్విట్‌ ఇండియా ఉద్యమం చిరస్మరణీయం: కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌:  భారత స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్‌ వలస పాలనను పారదోలాలనే  సంకల్పంతో గాంధీ ప్రారంభించిన క్విట్‌ ఇండియా మహోద్యమం చిరస్మరణీయమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు సందర్భంగా సీఎం ఆనాటి  మహనీయులకు నివాళులర్పించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను స్మరించుకోవాలని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts