నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి వెంకయ్యనాయుడు

అభినందించిన కె.నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవస్థలో అత్యున్నతమైన ఆ చివరి మెట్టు (రాష్ట్రపతి) కూడా వెంకయ్యనాయుడు ఎక్కుతారని అందరూ ఊహించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెంకయ్యనాయుడు ఓర్పుగా, నేర్పుగా అధిగమించేవారని, సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రభావితమై అక్కడి నుంచి భాజపాలో చేరి చివరికి ఉప రాష్ట్రపతిగా ఎదిగారని తెలిపారు. జై ఆంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్రపోషించాని, జయప్రకాశ్‌ నారాయణ నడిపిన సంపూర్ణ విప్లవంలో ఆయనతో కలిసి నడిచారని పేర్కొన్నారు. చివరి వరకు నమ్మిన విధానాలకు కట్టుబడినందున వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నానని నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts