కూర రాజన్నపై కేసులు ఎత్తివేయాలి

పౌరహక్కుల నేతల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జనశక్తి మాజీ నేత కూర రాజన్నపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేసి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా విప్లవ కార్యకర్తలు, ప్రజాసంఘాలపై అక్రమ కేసులు గతంలో మాదిరిగానే కొనసాగడం విచారకరమన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జయవింధ్యాల, జీవన్‌కుమార్‌, కోదండరాం, వీఎల్‌ విశ్వేశ్వరరావు తదితరులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని