కొత్త మోటార్ల కొనుగోలుకు ప్రణాళిక!

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్‌కు కొత్తగా నాలుగు మెటార్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. గత నెలలో వచ్చిన వరదలకు పంపుహౌస్‌లోని 17 మోటార్లు మునిగిపోయిన విషయం తెలిసిందే. వరద నీటిని తోడివేశాక.. బయటపడిన మోటార్లలో 4 దెబ్బతినగా మరో 6 అమర్చిన స్థానం నుంచి కదలినట్లు సమాచారం. మిగతా ఏడు సైతం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. సుమారు రెండు వందల మంది ఎలక్ట్రీషియన్లు సోమవారం విధుల్లో చేరారు. ప్యానెల్‌ బోర్డులు పూర్తిగా ధ్వంసం కావడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు. పంపుహౌస్‌ రక్షణ గోడను పూర్తిస్థాయిలో తొలగించి నూతన నిర్మాణం చేపట్టనున్నారు. కొత్తగా నాలుగు మోటార్లను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారని సమాచారం. ఈ మేరకు ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌ దేశాలలోని ఏబీబీ కంపెనీతో గుత్తేదారులు, ఇంజినీరింగ్‌ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.


మరిన్ని

ap-districts
ts-districts