Somasila: అటు కొండ.. ఇటు పంట.. సోమశిలలో అందాల విందంట..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిల పరిసరాల్లో పచ్చని పంటలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి ఎర్రని నేలలు మెట్ట పంటలకు అనువుగా ఉండటంతో ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న, పత్తి, కంది, మినుము, సజ్జ, రాగులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. నెల రోజులుగా వానలు పడుతుండటంతో పంట చేలల్లో అన్నదాతల శ్రమైక జీవన సౌందర్య దృశ్యాలు పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి.         

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


మరిన్ని

ap-districts
ts-districts