14న వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న వికారాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని, అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. మంగళవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ వికారాబాద్‌ పట్టణ పరిసరాల్లో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులెవరూ సెలవుల్లో వెళ్లకూడదని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శాసన సభ్యులు డాక్టర్‌ ఆనంద్‌, యాదయ్య, నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు.


మరిన్ని

ap-districts
ts-districts