పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గడువు

 పాటించాలంటూ వీసీలకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: యూజీసీ నియమావళి-2018 ప్రకారం పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గరిష్ఠ గడువని, దాన్ని పాటించాలని రాష్ట్రంలోని వర్సిటీల ఉపకులపతులకు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రవేశ పరీక్షకు 70 శాతం, ముఖాముఖి/వైవాకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఆచార్యుడు, సహ ఆచార్యుడు, సహాయ ఆచార్యుల వద్ద వరసగా 8, 6, 4కు మించి పీహెచ్‌డీ విద్యార్థులను తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts