సర్వే నంబర్‌ వారీగా పంటసాగు వివరాలు

ఈనాడు, హైదరాబాద్‌ : గ్రామాల్లో భూముల సర్వే నంబరు వారీగా ఏ భూమిలో ఎంత పంట వేశారనే వివరాలను ఆన్‌లైన్‌ ‘క్రాప్‌ బుకింగ్‌’ పోర్టల్‌లో నమోదు చేయాలని వ్యవసాయశాఖ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది. ఇంతకాలం రైతువారీగా వివరాలను నమోదు చేశారు. కానీ రెవెన్యూ శాఖకు చెందిన ధరణి పోర్టల్‌లో ఉన్న సర్వే నంబరు వారీగా పంటల సాగు వివరాలను సేకరించి నమోదు చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. దీనివల్ల ఏ సర్వే నంబర్లలో పంటలు సాగుకాలేదనే వివరాలు తెలుస్తాయి. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) గ్రామాల్లో ప్రతీ రైతు పొలం వద్ద నిలబడి ఆ భూమి సర్వే నంబర్‌ను, పంటను ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీనివల్ల పంటల సాగు విస్తీర్ణం లెక్కలు పక్కాగా వస్తాయని ఆ శాఖ అంచనా. కానీ మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు ఇంటర్‌నెట్‌ సిగ్నల్‌ లేక ఆన్‌లైన్‌లో పొలాల నుంచి ఫొటోలు తీసి నమోదు చేయలేకపోతున్నట్లు ఏఈవోలు వాపోతున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts