సెమ్స్‌ ఒలింపియాడ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో 1-12 తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్‌ ఒలింపియాడ్‌-2023కు సెప్టెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపియాడ్‌ సమాచార పత్రం, కరపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒలింపియాడ్‌ కన్వీనర్‌ ఆరుకాల రామచంద్రారెడ్డి, కోఆర్డినేటర్‌ ఎస్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదట ప్రాథమిక పరీక్షలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహిస్తామని, ఈ పరీక్షలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దశల వారీగా ఉంటాయన్నారు. అందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్‌కు ఎంపిక చేస్తామని, ఆ పరీక్షలు డిసెంబరు/ జనవరిలో జరుగుతాయని తెలిపారు. నాలుగోసారి ఒలింపియాడ్‌ను నిర్వహించబోతున్నామని, ప్రతిభావంతులకు రూ.కోటి విలువైన బహుమతులు అందజేస్తామని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని