ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మిస్తాం

మాలల ఐకాస

ఈనాడు, దిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మిస్తామని మాలల ఐకాస ఛైర్మన్‌ తాళ్లపల్లి రవి తెలిపారు.  మాలల ఐకాస ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో గురువారం ప్రదర్శన నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌ కుమార్‌, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సహకరించవద్దని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గురువారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథావలెకు విజ్ఞప్తి చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని