వనపర్తి, సంగారెడ్డి వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంగారెడ్డి, వనపర్తి వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి లభించింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఒక్కో వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున తరగతులు నిర్వహించేందుకు అంగీకరిస్తూ ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు లేఖ రాసింది. దీంతో ఈ ఏడాది తెలంగాణలోని నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి లభించినట్లయింది. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, జగిత్యాల వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ ఆమోదం లభించగా.. గురువారం మరో రెండు కళాశాలలకు అనుమతులు వచ్చాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని