భారతావని పులకించేలా వజ్రోత్సవాలు

తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రెజిమెంటల్‌బజార్‌, సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడికి వెళ్లినా భారత్‌ మాతాకీ జై అన్న నినాదంతో భారతావని పులకించేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గురువారం హైదరాబాద్‌ ఎర్రగడ్డలో తిరంగా బైక్‌ ర్యాలీని ఆయన ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈఎస్‌ఐ అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట మీదుగా సికింద్రాబాద్‌ వరకు ర్యాలీ సాగింది. రైల్వేస్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుల త్యాగాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా జరిగే అతి పెద్ద పండగ ఇదేనన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలన్నారు. 

బంజారాహిల్స్‌లో ఉత్సాహంగా ఫ్రీడం రన్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ఎన్టీఆర్‌భవన్‌ వరకు ఫ్రీడం రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్‌కు విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో మంత్రి తలసాని, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. రన్‌లో భాగంగా సీఆర్‌పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో 250 మీటర్లు, ఎమ్మెల్యే దానం ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాలను ప్రదర్శించారు. అంతకుముందు డీజే టిల్లు పాటకు మంత్రులు, ఎమ్మెల్యే, పోలీసు అధికారులు డ్యాన్స్‌ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని