నిర్వహణ లోపంతో చరిత్రకు తుప్పు..!

చరిత్ర సాక్ష్యాలను భద్రపరచి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన మ్యూజియంపై అశ్రద్ధ కారణంగా లక్ష్యం నెరవేరడం లేదు. నిజాం నవాబుల కాలంలో యుద్ధాల్లో వాడిన రకరకాల ఫిరంగులను హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్స్‌లోని స్టేట్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. నిర్వహణ లోపం కారణంగా అవి తుప్పుపడుతున్నాయి. ఫిరంగి బండి చక్రాలు విరిగిపోయి దర్శనమిస్తున్నాయి. ఎండకు ఎండి వానకు తడిసి ఫిరంగుల దిమ్మెలకు నాచు పట్టి కనిపిస్తోంది. దీంతో చరిత్ర తెలుసుకోవాలని ఉత్సాహంతో వచ్చే సందర్శకులకు నిరాశే మిగులుతోంది. 

-ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని