మువ్వన్నెల్లో మురిసిన కొండారెడ్డి బురుజు!

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వారం రోజులుగా త్రివర్ణ వెలుగుల్లో జిగేల్‌మంటోంది. బురుజు ముందు భాగంలో భారీ జాతీయ జెండా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కృష్ణానగర్‌లోని సర్వేపల్లి విద్యానిలయం పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. కృష్ణానగర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ తీశారు. 500మీటర్ల జెండాతో కొండారెడ్డి బురుజును చుట్టేశారు!

- ఈనాడు, కర్నూలు


తిరంగా.. విశాఖ మురవంగా!

విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో హెచ్‌.పి.సి.ఎల్‌., సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఆధ్వర్యంలో గురువారం 1240 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  - న్యూస్‌టుడే, పెదవాల్తేరు


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని