సహోదరభావాన్ని బలోపేతం చేసే రాఖీ

సీఎం కేసీఆర్‌ పండగ శుభాకాంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: సహోదర భావాన్ని రక్షా బంధన్‌ (రాఖీ పౌర్ణమి) బలోపేతం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాఖీ పండగ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు ఎల్ల వేళలా అండగా ఉంటారనే భరోసా ఈ పర్వదినంలో ఇమిడి ఉందన్నారు. రక్షాబంధన్‌ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావ్‌, తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌ శుభాకాంక్షలు 

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల స్ఫూర్తితో తెలంగాణలో సోదర సోదరీమణులు రాఖీ పౌర్ణమిని ఘనంగా ఉత్సాహంగా జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. రాఖీ ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక అన్నారు. 


మంత్రులకు మహిళా ఉద్యోగుల రాఖీలు

గురువారం బీఆర్‌కేభవన్‌లో వజ్రోత్సవాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కమిటీ ఛైర్మన్‌ ఎంపీ కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌లకు అధికారిణులు, ఉద్యోగినులు రాఖీలు కట్టారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని