మావోయిస్టు పార్టీ, అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగింపు

ఈనాడు, అమరావతి: మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. రివల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్‌డీఎఫ్‌), రాడికల్‌ యూత్‌ లీగ్‌ (ఆర్‌వైఎల్‌), రైతు కూలీ సంఘం, రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) సింగరేణి కార్మిక సంఘం (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య (వికాస), ఆల్‌ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌ఎస్‌ఎఫ్‌) వంటి సంఘాల్ని చట్ట విరుద్ధమైనవిగా ప్రకటిస్తూ ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 17వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా గురువారం ఉత్తర్వులిచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts