Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా

వేలచ్చేరి (చెన్నై), న్యూస్‌టుడే: ప్రముఖ సినీ నటి మీనా తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన 6 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశానని.. అనేక మంది ప్రముఖ నటులతో సుమారు 90 చిత్రాల్లో కలిసి పనిచేసినట్లు గుర్తుచేశారు. భర్త మృతి తనకు తీరని లోటని తెలిపారు. అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని