TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: వజ్రోత్సవాల సందర్భంగా 75 ఏళ్లు దాటిన వృద్ధులకు సోమవారం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. నిజామాబాద్‌, బోధన్‌ ప్రయాణ ప్రాంగణాలను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులు.. 12 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్గో ద్వారా సోమవారం.. ఒక కిలో పార్సిల్‌ను 75 కి.మీ ఉచితంగా పంపించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగదు రహిత సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. ఆర్‌ఎం ఉషాదేవి పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts