గుంటూరులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు

గుంటూరు(జిల్లా పరిషత్తు), న్యూస్‌టుడే: గుంటూరులో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు జూట్‌ మిల్‌ వద్దకు చేరుకోనున్న చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతారని గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. అక్కడి నుంచి గుజ్జనగుండ్ల కూడలిలోని చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్‌కు చేరుకుని 9.15 గంటలకు జాతీయ జెండా ఎగరవేస్తారని ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, ముఖ్య నాయకులు హాజరవుతారన్నారు.

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల చంద్రబాబు సంతాపం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మృతికి తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ‘బిగ్‌ బుల్‌ ఆఫ్‌ దలాల్‌ స్ట్రీట్‌’గా పేరొందిన ఝున్‌ఝున్‌వాలా భారత వ్యాపార రంగానికి చేసిన సేవలు ఎనలేనివని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts