ఇంటిపై కొలువైన బాపూజీ

  అభిమానంతో విగ్రహం ఏర్పాటు

కొలమానాలు లేని దేశభక్తి ఆ కుటుంబానిది. మూడు తరాల కిందట మొదలైన ఆరాధనాభావం ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. తెలంగాణ నిర్మల్‌లోని గాంధీచౌక్‌- కాల్వగడ్డ ప్రాంతంలో నివసించే నూకల అశోక్‌ ఇంటిపై గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆయన తాతయ్య నూకల విఠల్‌కు గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఉప్పు సత్యాగ్రహం సమయంలో బాపూజీ అరెస్టయి.. జైలు నుంచి విడుదలయ్యాక స్వయంగా ఆయనను కలిసి వచ్చారు. అంతటితో ఆగిపోలేదు. తాను ముచ్చటపడి కొనుగోలు చేసిన ఇంటి ప్రవేశద్వారంపై రెండడుగులకు పైగా ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ జయంతినాడు, ఇతర సందర్భాల్లో మర్చిపోకుండా ఆ విగ్రహానికి పూలమాల వేసేవారు. విఠల్‌ చనిపోయినా ఆయన కుమారుడు, మనవళ్లు ఆ అభిమానాన్ని అలాగే కొనసాగిస్తూ దేశభక్తిని చాటుతున్నారు. వీరు మహాత్ముడి జయంతి, వర్ధంతినాడు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా పిలుపుతో ఆ విగ్రహం వద్ద జాతీయజెండాను ఎగరేశారు.

- న్యూస్‌టుడే, నిర్మల్‌ పట్టణం


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని