హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆరుగురితో ప్రమాణం చేయించిన సీజే

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన ఆరుగురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.45 గంటలకు మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వారితో ప్రమాణం చేయించారు. శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన ఇ.వి.వేణుగోపాల్‌, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజ శరత్‌లతోపాటు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జె.శ్రీనివాసరావు, ఎన్‌.రాజేశ్వరరావులచే వరుస క్రమంలో ప్రమాణం చేయించారు. అంతకుముందు వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ ఈనెల 12న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి వచ్చిన ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రఘునాథ్‌, న్యాయవాదులు, కొత్త న్యాయమూర్తుల బంధువులు హాజరయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని