ఈ నెల 19న అల్పపీడనం!

బంగాళాఖాతంలో శుక్రవారం(ఈ నెల 19న) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ భారత ప్రాంతాల మధ్య రాయలసీమ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నారు వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా దిగ్వాల్‌(సంగారెడ్డి జిల్లా)లో 2.9. పెద్దేముల్‌(వికారాబాద్‌)లో 2, ముల్కలపల్లి(భద్రాద్రి)లో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.


మరిన్ని

ap-districts
ts-districts