ఎల్బ్రస్‌ శిఖరాగ్రంపై మంచిర్యాల చిన్నారి

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: తెలంగాణకు చెందిన చిన్నారి హస్వి(14) అరుదైన ఘనతను సాధించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరోపాలోని అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించింది. 24 గంటల వ్యవధిలో రెండువైపుల (తూర్పు, పడమర)నుంచి ఈ శిఖరాగ్రాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. సముద్రమట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఎల్బ్రస్‌ శిఖరాగ్రం ఉండగా పశ్చిమం నుంచి సోమవారం ఉదయం పూర్తి చేసింది. తూర్పు నుంచి కూడా (5,621 మీటర్ల ఎత్తు) మంగళవారం ఉదయం పూర్తి చేసుకుంది. 45 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, -20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణం అనుకూలంగా లేకపోయినా.. విజయవంతంగా అధిరోహించినట్లు హస్వి తెలిపింది. మంచిర్యాలకు చెందిన ఈ చిన్నారి తల్లిదండ్రులు మాధవి-వెంకట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హస్వి శామీర్‌పేటలోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్సెలెన్షియాలో పదో తరగతి చదువుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని