రాముడి మాన్యంలోనే ఆక్రమణదారులు

ఇళ్లకు స్థలం కేటాయించాలని దరఖాస్తులు

సరిహద్దులో మోహరించిన పోలీసు బలగాలు

భద్రాచలం, న్యూస్‌టుడే:  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూమిని ఆక్రమించుకున్న వారు తాము అక్కడ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. రాములవారికి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో ఒకేచోట 15 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇది రామాలయానికి 3 కి.మీ దూరంలో రహదారి పక్కన ఉండడంతో సరిహద్దు ప్రాంతంలోని వందల మంది దీన్ని ఆక్రమించుకునేందుకు తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఈ జాగాలోకి వెళ్లి రాత్రంతా అక్కడే ఉన్నారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టకుండా దేవస్థానం సిబ్బంది అక్కడే జాగారం చేశారు. మంగళవారం ఉదయం వీరిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తమపై దయ చూపించాలని వేడుకున్నారు. బృందాలుగా విడిపోయి అక్కడే కొందరు వంటలు చేసుకుని కదలకుండా భీష్మించారు. ఈ పరిస్థితిని ఈవో శివాజీ దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడి ఆక్రమణలను తొలిగించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోను దేవుడి స్థలాన్ని రక్షించుకుంటామని మరోసారి ఇలా ఆక్రమణకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రామాలయం ఈవో తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని