ఆర్జీయూకేటీ ప్రవేశాల్లో జాప్యం

ఇంకా ప్రారంభం కాని ప్రక్రియ

ముథోల్‌, న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటనలో జాప్యం కొనసాగుతోంది. ఆగస్టు రెండో వారంలో ప్రకటిస్తామని చెప్పిన అధికారులు దరఖాస్తులు ఎక్కువగా రావడం, ఈడబ్ల్యూఎస్‌ కోటాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో తర్జనభర్జన పడుతున్నారు. గతంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా కాకుండా నేరుగా జాబితాను ప్రకటించేవారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10 శాతం సీట్లు కేటాయించాల్సి రావడంతో న్యాయ, ఇతర నిపుణులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే జాబితాను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

కొలిక్కిరాని జాబితా..

ఈ ఏడాది 33,005 దరఖాస్తులు రాగా అందులో 30,657 దరఖాస్తులను ఆమోదించారు. వివిధ కోటాల్లో 1500, గ్లోబల్‌, ఎన్‌ఆర్‌ఐ 105, అగ్రవర్ణ పేదలకు 150 కలిపి మొత్తం 1755 సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు కొందరు తమకు సీటు వస్తుందని భరోసాతో ఏ కళాశాలలో చేరలేదు. మిగిలిన కొందరు విద్యార్థులు ఇప్పటికే ఆయా కళాశాలలో ప్రవేశాలు తీసుకున్నారు. జాబితాను ఇంతవరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

త్వరలో ప్రకటిస్తాం
- వెంకటరమణ, ఇన్‌ఛార్జి ఉపకులపతి
జాబితా విడుదల జాప్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జాబితాను తయారు చేయిస్తున్నాం. సీట్లు పెరగడంతో 2, 3రోజుల్లో ప్రభుత్వ అనుమతి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసి జాబితాను త్వరలో ప్రకటిస్తాం.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని