సంక్షిప్త వార్తలు

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 564 స్పాట్‌ ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లకు తొలిసారిగా స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించగా 564 మంది సీట్లు పొందారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన 493 మంది...అర్హత సాధించని వారు 158 మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వగా 564 మందికి సీట్లు దక్కాయి. వారందరూ బుధవారం లోపు కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి.


37 కస్తూర్బాల్లో ఇంటర్‌కు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రథమ, వచ్చే ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతుల బోధనకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓ జారీ చేసింది. ఇంటర్‌ విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత ఈ అనుమతి రావడం గమనార్హం.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని