జాతీయ రైతు సమాఖ్య కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం మైసూర్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించిన జాతీయ రైతు సమాఖ్య కార్యకర్త విమల్‌కుమార్‌ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.పది లక్షల సాయాన్ని ప్రకటించారు. మంగళవారం జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్‌ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమల్‌కుమార్‌ తల్లికి సాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతులకు ఆత్మబంధువని, వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతులకు రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ, నిరంతర ఉచిత విద్యుత్‌ లాంటి పథకాల ద్వారా అండగా నిలుస్తున్నారని తెలిపారు. కర్ణాటకకు చెందిన వారైనప్పటికీ రైతు విమల్‌కుమార్‌ మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, వారి కుటుంబానికి ఆసరా అయ్యేందుకు రూ.పది లక్షల సాయం ప్రకటించారని చెప్పారు. ఈ సందర్భంగా విమల్‌కుమార్‌ కుటుంబీకులు, శాంతకుమార్‌, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, తెలంగాణ రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని