బధిరుల కోసం ఓ యాప్‌!

 సైన్‌ లాంగ్వేజ్‌లో లీగల్‌ నాలెడ్జ్‌ కోర్సు

ఈనాడు, హైదరాబాద్‌: పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతూ సమాజంలో అసమానతల మధ్య మరింత కుంగిపోయే అభాగ్యుల కోసం హైదరాబాద్‌కు చెందిన డెఫ్‌ ఇనేబుల్డ్‌ ఫౌండేషన్‌(డీఈఎఫ్‌) ఓ యాప్‌ రూపొందించింది. అలాంటి వారికి సైన్‌ లాంగ్వేజ్‌పై అవగాహన కల్పించడంతో పాటు న్యాయపరమైన హక్కులపై శిక్షణ అందించేందుకు ‘ఎడు సైన్‌ అకాడమీ’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. సాధారణ వ్యక్తులు సైతం ఈ యాప్‌ ద్వారా సైన్‌ లాంగ్వేజ్‌పై పట్టు సాధించి బధిరులతో సంభాషించొచ్చు. ప్రత్యేక కోర్సు ద్వారా ఇంగ్లిష్‌ కన్వర్జేషనల్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, హెల్త్‌ అవేర్‌నెస్‌, ఐటీ స్కిల్స్‌, లీగల్‌ నాలెడ్జ్‌ వంటి అంశాలను వీడియోల్లో వివరిస్తారని డీఈఎఫ్‌ ప్రతినిధి ఎం.రమ్య తెలిపారు. ప్రతి వీడియోను సైన్‌ లాంగ్వేజ్‌లో నిపుణులైన వారి సాయంతో రూపొందించామన్నారు. ప్రధానంగా లీగల్‌ నాలెడ్జ్‌ కోర్సులో ఫ్లాగ్‌ ఆఫ్‌ ఇండియా, రాజ్యాంగం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, డిసెబిలిటీస్‌ యాక్టు గురించి వీడియోలు పొందుపరిచామన్నారు. ఇప్పటి వరకు 30 వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు రమ్య తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని