రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. మంగళవారం రాజ్‌భవన్‌ వద్ద భారతీయ రెడ్‌క్రాస్‌ సొసైటీకి చెందిన నాలుగు సంచార రక్తసేకరణ వ్యాన్లను ఆమె ప్రారంభించారు. ఈ వ్యాన్లు నేరుగా దాతల వద్దకే వెళ్లి  రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ వాహనాలను హనుమకొండ, హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ అజయ్‌ మిశ్రా, గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని