అమెరికాలో శ్రీవారికి సహస్ర కలశాభిషేకం

ఈనాడు, అమరావతి: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు నక్షత్రశాంతి ఆగమోక్త ఆచారాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్ర పఠనం, శాంతిమంత్ర జపాలు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో దేవస్థానం ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గోమాతను పూజించారు. అమెరికాలో తొలి దేవాలయంగా పేరొందిన ఇక్కడ 47 ఏళ్లుగా ఉత్సవాలు, కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నారు. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌ నాగబండి, కార్యదర్శి చంద్రశేఖర్‌, ప్రెసిడెంట్‌ శర్వన, కోశాధికారి రాజి శ్రీనివాసన్‌, కల్యాణ్‌ శీలంనేని, శ్రావణ్‌ చిన్నల, చంద్ర భోనగిరి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని