ఫార్మా పరిశోధనలకు భారత్‌ చిరునామా

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆశాభావం

శామీర్‌పేట, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ఫార్మా సంస్థల పరిశోధనకు భారత్‌ చిరునామాగా మారడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పరిధిలోని జీనోంవ్యాలీలో రూ.346 కోట్లతో నిర్మిస్తున్న నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌(ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్‌) సెంటర్‌ను  మంగళవారం ఆయన సందర్శించారు. కేంద్రంలో జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మానవ, జంతు ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధికి జాతీయస్థాయి ప్రయోగ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రధాని సంకల్పిస్తే రాష్ట్ర సర్కారు ఇక్కడ వంద ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ కేంద్రంలో 4 లక్షల చ.అడుగుల స్థలంలో పరిశోధన కేంద్రాలను నిర్మిస్తున్నామని.. చిన్న, పెద్ద జంతువులపై బయోమెడికల్‌ ప్రయోగాల నిర్వహణకు అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్‌ ఎండీ రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

దిగజారి వ్యవహరిస్తున్న కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగజారి వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గవర్నర్‌ నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి గైర్హాజరై సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం చేయడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం మాజీ ప్రధాని వాజ్‌పేయీ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు ముఖ్యమంత్రి కాలేరనే భయంతో కేసీఆర్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై ఎందుకు రాళ్లు రువ్వారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని