ఇక సర్కారీ మాంసం కొట్లు!

ఈనాడు, హైదరాబాద్‌: పాలు, వంటనూనెల మాదిరిగా మేకలు, గొర్రెల నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేకంగా దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సన్నాహాలు చేస్తోంది. గత మూడేళ్లలో కిలో మాంసం ధర రూ.500 నుంచి రూ. 800కి ఎగబాకింది. ధరల నిర్ణయం వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. పైగా రోడ్లపక్కనే మేకలు, గొర్రెలను కోసి విక్రయిస్తుండడంతో దుమ్ము, ధూళి చేరుతున్నట్లు జాతీయ మాంస పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) శాస్త్రవేత్తల పరిశీలనలో గుర్తించారు. నాణ్యమైన మాంసాన్ని అందుబాటు ధరల్లో విక్రయించేందుకే సర్కారీ దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌ డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ తెలిపారు. సమాఖ్య తొలుత హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లో మత్స్యశాఖ చేపల దుకాణం పక్కనే మాంసం విక్రయాలు ప్రారంభించనుంది. తర్వాత రాష్ట్రమంతటా రైతుబజార్లలో దుకాణాల ఏర్పాటు చేయనుంది. ‘మేకలు, గొర్రెల పెంపకందారుల సంఘాల ఆధ్వర్యంలోనే దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు నాణ్యమైన మాంసం లభిస్తుంది. చిల్లరధర కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తాం’ అని బాలరాజ్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు