అమ్మవారికి అక్షర నీరాజనం

భక్తులతో పోటెత్తిన బాసర సరస్వతీ క్షేత్రం

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసరలోని సరస్వతీ క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. దసరా ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఆదివారం సరస్వతీ అమ్మవారు కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సప్తమి ఘడియల్లో అమ్మవారి చెంత 3,634 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయంలో మూలా నక్షత్ర, సరస్వతీ పూజలు నిర్వహించారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నాలుగు గంటలు, అక్షరాభ్యాసానికి మూడు గంటల సమయం పట్టింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు.. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌, నిజామాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్లు విజయలక్ష్మి, దాదన్నగారి విఠల్‌రావులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. క్యూలైన్లలో తాగునీరు అందే అవకాశం లేక.. గంటల తరబడి వేచి ఉండలేక కొందరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని